మధ్యప్రదేశ్ హోషంగాబాద్ జిల్లాలో మద్యం కొనుగోలు చేసినవారి చేతికి సిరాతో వేలిపై ముద్ర వేస్తున్నారు అబ్కారీ అధికారులు. భవిష్యత్తులో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే త్వరగా గుర్తించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు జిల్లా అబ్కారీ అధికారి అభిషేక్ తివారి.
"మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చినవారి వేలికి చెరిగిపోని ఇంక్‌తో ముద్ర వేస్తున్నాం. భవిష్యత్తులో అవసరమైతే వీరిని గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. వినియోగదారుల పేరు, చిరునామా, మొబైల్ నంబర్ తదితర వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకుంటున్నారు మద్యం దుకాణదారులు."