తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మిడతలపై  యుద్ధానికి  వంట సామగ్రే ఆయుధాలు - ఉత్తర్​ప్రదేశ్​లో మిడతల దాడి

దేశంలోకి ప్రవేశించిన మిడతల దండు అన్ని రాష్ట్రాల రైతులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిడతలను రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉత్తర్​ప్రదేశ్‌లోని కాన్పూర్ రైతులు తమ వ్యసాయ క్షేత్రాల వద్ద వంట సామగ్రితో పెద్దఎత్తున శబ్దాలు చేస్తున్నారు. అధికారులు సైతం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

మిడతల నివారణకు వంట సామాగ్రితో పొలాల్లో రైతులు
People bang utensils and drums in an agricultural field as a precautionary measure to ward off locusts

By

Published : May 29, 2020, 3:49 PM IST

దేశంలో మిడతలు అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. నోటికి అందినంత పంటను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ పురుగులను తరిమేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఉత్తర్​ప్రదేశ్‌లోని కాన్పూర్ రైతులు వ్యసాయ క్షేత్రాల వద్ద పెద్దఎత్తున శబ్దాలు చేస్తున్నారు. ముఖ్యంగా వంట సామగ్రితో శబ్దాలు చేస్తూ.. మిడతలు తమ పొలాల వైపు రాకుండా రైతులు జాగ్రత్త పడుతున్నారు. ఫైర్ ట్యాంకర్ల సాయంతో కెమికల్స్ స్ప్రే చేయడం వంటి నివారణ చర్యలు పాటిస్తున్నారు.

డీజేతో చెక్​..

ఛత్తీస్​గఢ్​ కవర్దా జిల్లాలోని లొహారా సరహద్దు ప్రాంతంలోకి మిడతలు ప్రవేశించాయి. ఈ మిడతల దండు నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. డీజే శబ్దాలతో మిడతలను తరిమికొట్టేందుకు చర్యలు చేపడుతోంది. స్పీకర్లు వంటి సంగీత పరికరాలను ఏర్పాటు చేయాలని, రసాయన ఎరువులు పంటలపై పిచికారీ చేయాలని రైతులకు సూచిస్తున్నారు అధికారులు.

మిడతల నివారణకు వంట సామాగ్రితో పొలాల్లో రైతులు

ఇదీ చూడండి:వీరేంద్ర కుమార్​ మృతిపై ప్రముఖుల సంతాపం

ABOUT THE AUTHOR

...view details