పెండింగ్లో ఉన్న సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షా తేదీలను ప్రకటించింది కేంద్ర మానవ వనరుల శాఖ . జులై ఒకటి నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.
జులై 1 నుంచి సీబీఎస్ఈ 10,12 తరగతి పరీక్షలు
జులై 1 నుంచి 15 వరకు పెండింగ్లో ఉన్న సీబీఎస్ఈ 10,12వ తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ తెలిపింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
జులై 1 నుంచి సీబీఎస్ఈ 10,12 తరగతి పరీక్షలు
సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతులకు సంబంధించి లాక్‌డౌన్‌కు ముందే కొన్ని పరీక్షలను నిర్వహించారు అధికారులు. మిగిలిన పరీక్షలు జరిగాల్సి ఉండగా వాటిని కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు. వీటిని జులైలో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు.