తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సొంత స్కూల్​లోనే బోర్డ్​ పరీక్షలు- జులై చివర్లో ఫలితాలు - CBSE latest announcement news

లాక్​డౌన్​ సడలింపుల నేపథ్యంలో పెండింగ్​లో ఉన్న 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ వెల్లడించింది. ఇతర పరీక్షల కేంద్రాల్లో కాకుండా సొంత పాఠశాలలోనే పరీక్షలకు హాజరవుతారని తెలిపింది. జులై చివరి వారంలో ఫలితాలు వెల్లడించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు స్పష్టం చేసింది.

board exams
సొంత పాఠశాలలోనే బోర్డ్​ పరీక్షలు

By

Published : May 20, 2020, 1:35 PM IST

Updated : May 20, 2020, 3:06 PM IST

దేశవ్యాప్తంగా పెండింగ్​లో ఉన్న 10, 12వ తరగతుల పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్​ఆర్​డీ). అయితే .. విద్యార్థులు ఇతర పరీక్ష కేంద్రాల్లో కాకుండా సొంత పాఠశాలలోనే పరీక్షలకు హాజరవుతారని స్పష్టం చేసింది.

లాక్​డౌన్​ విధించక ముందు జరిగిన పరీక్షల జవాబు పత్రాల ముల్యాంకన ఇప్పటికే ప్రారంభించిన నేపథ్యంలో జులై చివరి వారంలో ఫలితాలు ప్రకటించేందుకు ప్రణాళిక రచిస్తోంది హెచ్​ఆర్​డీ. ఈ మేరకు పెండింగ్​ పరీక్షల నిర్వహణపై వివరాలు వెల్లడించింది సీబీఎస్​ఈ బోర్డు.

" సొంత పాఠశాలలోనే విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకే ఇతర కేంద్రాలలో నిర్వహించకూడదని నిర్ణయించాం. భౌతిక దూరం నియమాలను పాటించటంపై ఆయా పాఠశాలలదే భాధ్యత. విద్యార్థులు తప్పనిసరిగా సొంత శానిటైజర్​ వెంట తెచ్చుకోవాలి, మాస్కు ధరించాలి."

- సీబీఎస్​ఈ బోర్డు

జులై 1-15 నుంచి పరీక్షలు..

లాక్​డౌన్​తో వాయిదా పడిన 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్​ను సోమవారం (మే18న) విడుదల చేసింది సీబీఎస్​ఈ. జులై 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.

Last Updated : May 20, 2020, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details