కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కర్ణాటక పెజావర మఠం పీఠాధిపతి విశ్వేశ్వర తీర్థ స్వామీజీ(88) కన్నుమూశారు. ఎనిమిది రోజులుగా బెంగళూరులోని కస్తూర్బ ఆస్పత్రిలో చికిత్స పొందిన స్వామీజీ... ఈ ఉదయం 9:20 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు మఠ నిర్వహకులు ప్రకటించారు.
శ్వాస, గుండె సంబంధిత సమస్యలతో స్వామీజీ ఈ నెల 20న బెంగళూరులోని కస్తూర్బా ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి వైద్య బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందించింది. అయితే ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమించగా, ఆయన కోలుకోలేదు.
మోదీ విచారం
స్వామీజీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ప్రజల హృదయాల్లో ఆయన జీవించే ఉంటారని ఉద్ఘాటించారు. స్వామీజీతో ఉన్న జ్ఞాపకాలను మోదీ గుర్తుచేసుకున్నారు.