కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో 41 రోజుల పాటు సాగే తొలి దశ నిత్య పూజలు నేటితో పూర్తి కానున్నాయి. పవిత్రమైన మండల పూజ నిర్వహించి శుక్రవారం సాయంత్రం ఆలయాన్ని మూసివేయనున్నారు పూజారులు. గత ఏడాది ఇదే సమయంలో మహిళల ప్రవేశంపై పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినప్పటికీ.. ఈ సంవత్సరం ప్రశాంతంగా అయ్యప్ప దర్శనం చేసుకున్నారు భక్తులు.
భారీ ఆదాయం..
తొలి దశ 41 రోజుల నిత్యపూజ కార్యక్రమం గత నవంబర్ నెలలో 16వ తేదీన ప్రారంభమైంది. సుమారు నెలన్నర పాటు పూజల అనంతరం డిసెంబర్ 27 తో తొలిదశ ముగుస్తుంది. ఈసారి అయ్యప్ప కొండకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిరసనలకు తావులేకుండా కట్టుదిట్టమన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. 2018లో ఇదే సమయానికి రూ.105.29 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అది రూ.156 కోట్లకు చేరింది. 2017లో అత్యధికంగా రూ.164.03 కోట్ల ఆదాయంతో రికార్డుగా నిలిచింది. ఈ ఏడాది అయ్యప్ప ప్రసాదం 'అరవన' విక్రయంతో రూ.67.77 కోట్లు సమకూరినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. నాణేల లెక్కింపు కూడా చేస్తున్నందన ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
మహిళల ప్రవేశంపై ఆంక్షలు..