జమ్ముకశ్మీర్లో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీని విన్నవించింది పీపీల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ). కశ్మీర్ అంశంలో ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోబోమని ప్రధాని హామీ ఇవ్వాలని పీడీపీ శ్రేణులు కోరారు.
రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో పార్టీ కీలక నేతలు సమావేశమయ్యారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై రాష్ట్ర ప్రజలు విశ్వాసంతో ఉన్నారని ఉద్ఘాటించారు. ప్రజల నమ్మకాన్ని ప్రధాని వమ్ముచేయరని భావిస్తున్నట్లు పీడీపీ పేర్కొంది. అలా కాకుండా రాజ్యాంగ మార్పునకు, ఏవైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే అది ప్రజల గౌరవాన్ని అవహేళన చేసినట్లేనని వెల్లడించింది.