కశ్మీర్లో భూములను దేశంలోని ఎవరైనా కొనుగోలు చేసేలా చట్టాల్లో మార్పులు చేయటం సహా ఎన్జీఓలు, ట్రస్టుల్లో ఎన్ఐఏ సోదాలను వ్యతిరేకిస్తూ.. ఆందోళనకు దిగింది పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ(పీడీపీ). శ్రీనగర్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీపంలో పెద్ద సంఖ్యలో పీడీపీ కార్యకర్తలు నిరసనకు చేపట్టారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. పీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
భూ చట్టాలకు వ్యతిరేకంగా పీడీపీ ఆందోళన- పలువురి అరెస్ట్ - కశ్మీర్లో భూముల కొనుగోలుపై ఆందోళన
13:11 October 29
శ్రీనగర్‌లో పీడీపీ కార్యకర్తల ఆందోళన
11:41 October 29
కశ్మీర్లో భూముల కొనుగోలుపై పీడీపీ ఆందోళన
జమ్ముకశ్మీర్‌లో ఎవరైనా భూములు కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయటంపై ఆందోళన చేపట్టింది పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ). ప్రభుత్వ నిర్ణయం వల్ల కశ్మీర్లో నేరాలు పెరిగిపోతాయని.. ఈ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది.
ఈ క్రమంలో నిరసనకారులను అడ్డుకున్నారు పోలీసులు. శ్రీనగర్‌లోని పీడీపీ కార్యాలయాన్ని మూసివేశారు. సీనియర్ నాయకులు, పార్టీ నేతలను అరెస్ట్ చేశారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
శాశ్వత వ్యక్తి పదం తొలగింపు..
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన 15 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఇతర ప్రాంతాల వారు కూడా జమ్ముకశ్మీర్‌లో భూమి కొనుగోలుకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ అభివృద్ధి చట్టంలోని సెక్షన్ 17లో ఉన్న ఆ రాష్ట్రానికి చెందిన శాశ్వత వ్యక్తి అనే పదాన్ని తొలగించింది. కేంద్రం నిర్ణయం నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌కు చెందని వ్యక్తులకు అక్కడ భూమి కొనుగోలులో చట్టబద్ధంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.