తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డేరా బాబా​ నానక్​ టు కర్తార్​పుర్​: బస్సు​ సేవలు ప్రారంభం - latest kartharpur news

సిక్కు భక్తుల సౌకర్యం కోసం డేరాబాబా నానక్​ నుంచి కర్తార్​పుర్​ నడవా ప్రధాన ద్వారం వరకు పంజాబ్​​ ప్రభుత్వం బస్సు సేవలు  ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర​ రవాణాశాఖ మంత్రి రజియా సుల్తానా ప్రకటించారు.

డేరాబాబా​ టు కర్తార్​పుర్​ నడవాకు బస్సు​ సేవలు

By

Published : Nov 23, 2019, 8:55 PM IST

సిక్కు యాత్రికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని డేరాబాబా నానక్ నుంచి కర్తార్​పుర్ నడవా ప్రధాన ద్వారం వరకు బస్సు సర్వీసును ప్రారంభించింది పంజాబ్ ప్రభుత్వం. ఈ రోజు నుంచి బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రజియా సుల్తానా వెల్లడించారు.

"డేరాబాబా నానక్​ వద్ద ఉదయం 8.45గంటలకు బస్సు ప్రారంభమవుతుంది. 9 గంటలకు కర్తార్​పూర్​ సాహిబ్​ నడవా ప్రధాన ద్వారం వద్దకు చేరుస్తుంది. సాయంత్రం మరలా 5.15 గంటలకు నడవా ​నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా బస్సుల సంఖ్య పెంచుతాం."

- రజియా సుల్తానా, పంజాబ్​ రవాణాశాఖ మంత్రి.

ఇతర ప్రధాన నగరాల నుంచి డేరా బాబా నానక్​కు కొన్ని బస్సులను నడపాలని పంజాబ్ రోడ్డు రవాణా సంస్థను ఆదేశించారు రజియా సుల్తానా.

ఇదీ చూడండి : 76వ స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ జెండాలతో నిరసనలు

ABOUT THE AUTHOR

...view details