రాష్ట్రపతి పదవి కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రతిపాదించే అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు పరిశీలించాలని కోరారు శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్. 2022లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగేనాటికి ఆ పదవిని ఎవరు చేపట్టాలో నిర్ణయించేంత సంఖ్యాబలం తమకు ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు రౌత్.
"దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో శరద్ పవార్ ఒకరు. 2022లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని పార్టీలు పవార్‌ను ఎన్నుకునే అంశాన్ని పరిశీలించాలి. మిగతా పార్టీలు ఇతర సీనియర్లను రాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో నిర్ణయించేంత సంఖ్యాబలం 2022 నాటికి మాకు ఉంటుంది."