మహారాష్ట్రలో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఎన్సీపీ, కాంగ్రెస్..అందుకోసం కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ మేరకు దిల్లీలో ఆదివారం సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కనీస ఉమ్మడి ప్రణాళికపై శివసేనతో కలిసి కాంగ్రెస్, ఎన్సీపీ కసరత్తు పూర్తి చేశాయి.
'మహా' కసరత్తుపై సోనియాతో భేటీకానున్న పవార్! - congress latest news
శివసేనతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై చర్చించేందుకు సోనియా గాంధీతో రేపు భేటీ కానున్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. దిల్లీలో ఈ సమావేశం జరిగే అవకాశముంది.
సోనియాతో భేటీ కానున్న పవార్!
మూడు పార్టీల మధ్య మంత్రిపదవుల పంపకం అంశం సోనియా, పవార్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బయట నుంచి మద్దతునివ్వకుండా ప్రభుత్వంలో చేరాలని ఎన్సీపీ కోరుకుంటోంది.
ఇదీ చూడండి: అంతా చూస్తుండగానే.. సినీ ఫక్కీలో వ్యక్తి కిడ్నాప్
Last Updated : Nov 16, 2019, 8:18 PM IST