తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశా: బీజేడీ పక్షనేతగా పట్నాయక్​ ఎన్నిక రేపే - ఒడిశా

ఒడిశా శాసనసభలో బీజేడీ పక్ష నేతగా సీఎం నవీన్​ పట్నాయక్​ను ఎన్నుకోనున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఈ మేరకు  భువనేశ్వర్​లో ఆదివారం భేటీ కానున్నారు.

నవీన్​ పట్నాయక్

By

Published : May 25, 2019, 8:36 AM IST

బీజేడీ పక్షనేతగా పట్నాయక్​ ఎన్నిక రేపే

బిజూ జనతా దళ్ శాసనసభ పక్షనేతగా ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్​ను ఎన్నుకోనున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఇందుకోసం భువనేశ్వర్​లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని బీజేడీ అధికార ప్రతినిధి సస్మిత్​ పాత్ర తెలిపారు.

రాజ్​భవన్​లో మే 29న పట్నాయక్​ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.

ఒడిశాలో వరుసగా ఐదోసారి అధికారాన్ని దక్కించుకుంది బీజేడీ. 146 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో 112 స్థానాలను కైవసం చేసుకుంది. లోక్​సభ ఎన్నికల్లో 21కి గాను 12 స్థానాల్లో విజయం సాధించింది బీజేడీ.

ఇదీ చూడండి: ఒడిశా పీఠం మళ్లీ నవీన్​ పట్నాయక్​దే....

ABOUT THE AUTHOR

...view details