దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ఒక ఆస్పత్రిలో కరోనా బాధితుల పక్కన అదే వ్యాధితో మరణించిన వారి శవాలను ఉంచిన వీడియో గురువారం కలకలం రేపింది. సయాన్ ప్రాంతంలో ఉన్న లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆస్పత్రిలో కరోనా వ్యాధితో మరణించిన వారి భౌతిక కాయాలను కవరులో చుట్టి బాధితుల గదిలోనే ఉంచారు. భాజపా ఎమ్మెల్యే నితేశ్ రాణే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేయటంతో అది వైరల్‌గా మారింది.
కరోనా బాధితుల పక్కన మృతదేహాలు - corona latest updates
ముంబయిలోని ఓ ఆస్పత్రిలో కరోనా బాధితుల పక్కన అదే వ్యాధితో మరణించిన వారి శవాలను ఉంచిన వీడియో వైరల్‌గా మారింది. భాజపా నేత నితేశ్ రాణే ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
కరోనా బాధితుల పక్కన మృతదేహాలు!
ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు బృహత్ ముంబయి కార్పొరేషన్‌ను విమర్శిస్తూ వీడియో జత చేశారు రాణే.