సాధించాలనే తపన ఉంటే.. ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం అడ్డుకావని మరోసారి నిరూపించాడు కేరళకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి. బైక్ కొనుక్కునే స్థోమత లేదని చింతిస్తూ కూర్చోకుండా తానే స్వయంగా ఓ ద్విచక్రవాహనాన్ని తయారు చేసుకుని ఔరా అనిపిస్తున్నాడు.
కొట్టాయం జిల్లా, వైక్కోంకు చెందిన సుమిత్ సునీల్ అలియాస్ అంబలికి బాల్యం నుంచే బైకులు నడపాలనే కోరిక ఉండేది. కానీ, నాన్న ఆటో నడిపి తెచ్చే డబ్బు ఇల్లు గడవడానికే సరిపోవు, ఇక బండి కొనివ్వమని అడిగే పరిస్థితి లేదు. కుటుంబ ఆర్థిక స్థోమత తెలుసుకున్న అంబలి పదో తరగతి చదువుతున్నప్పుడే తన పాత సైకిల్‌కు బైకు భాగాలు బిగించి బైకు నడుపుతున్నట్లే భావించేవాడు.