తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌరసత్వ బిల్లుకు ఆమోదం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం' - ప్రియాంక గాంధీ

లోక్​సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్​. పౌరసత్వ బిల్లు ఆమోదం పొందటాన్ని రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ. అర్ధరాత్రి బిల్లును ఆమోదించడం ద్వారా మత దురభిమానం, సంకుచిత మనస్తత్వంతో కూడిన దేశ పరిస్థితి బయటపడిందని ఎద్దేవా చేశారు ప్రియాంక గాంధీ.

Rahul Gandhi
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగపై దాడి

By

Published : Dec 10, 2019, 2:08 PM IST

వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లు లోక్​సభలో ఆమోదం పొందటంపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్​. ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ.

" పౌరసత్వ చట్ట సరవణ బిల్లు అనేది భారత రాజ్యాంగంపై దాడి. దీనికి మద్దతు ఇచ్చే వారు ఎవరైనా మన దేశ పునాదులపై దాడి చేసి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లే."

- రాహుల్​ గాంధీ.

మూర్ఖత్వం, సంకుచిత మనస్తత్వం...

పౌరసత్వ బిల్లు విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. సోమవారం అర్ధరాత్రి లోక్​సభలో బిల్లు ఆమోదం పొందటం ద్వారా మత దురభిమానం, సంకుచిత మనస్తత్వంతో కూడిన దేశ పరిస్థితి బయటపడిందని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​ రాజకీయ నేతల విడుదల మా చేతుల్లో లేదు'

ABOUT THE AUTHOR

...view details