తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విహారి: ఆ ఆలయంలో పూజలన్నీ ప్రకృతికే - ameri

ఆలయంలో ఒక రూపంలో ఉండే దేవుడికి పూజలు చేయటం అందరికీ తెలుసు. ప్రకృతికి ఆలయం ఉండటం ఎప్పుడైనా చూశారా? ఛత్తీస్​​గఢ్​ రాయ్​పుర్​ జిల్లా అమెరి గ్రామంలో పర్యవరణ్​​ దామ్​ అనే ఆలయం ఉంది. అక్కడ ప్రకృతినే దేవతగా పూజిస్తారు.

విహారి: ఆ ఆలయంలో పూజలన్నీ ప్రకృతికే

By

Published : Jun 9, 2019, 7:42 AM IST

విహారి: ఆ ఆలయంలో పూజలన్నీ ప్రకృతికే

ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నది ఛత్తీస్​​గఢ్​ రాయ్​పుర్​ జిల్లా అమెరి గ్రామవాసులు విశ్వాసం. నమ్మకమే కాదు... ఏకంగా ఆలయం నిర్మించి ప్రకృతిని దేవతగా కొలుచుకుంటున్నారు.

దేశంలోని ఆసక్తికర ఆలయాల్లో అమెరిలోని పర్యావరణ్​ దామ్​ ఒకటి. హిందువులకు ఇది ఒక ప్రముఖ పుణ్యస్థలం. ప్రకృతిని దేవతగా పూజించటం ఇక్కడి ప్రత్యేకత.

ఇరవై ఏళ్ల క్రితం ఆలయ నిర్మాణం చేప్టటారు. ఆలయం ప్రాంతంలో ఓ భక్తుడు మొక్కలు నాటడం ప్రారంభించాడు. ఆయనకు గ్రామస్థులు సాయం చేస్తూ మొక్కల పెంపకం చేపట్టారు. అనంతరం ఆలయానికి పర్యావరణ్​ దామ్​ అని నామకరణం చేశారు. ఈ ఆలయం పుణ్యక్షేత్రంగానే కాదు పర్యటక కేంద్రంగానూ పేరుగాంచింది.

"ఇటుక, రాయి, ఇనుము, సిమెంట్​తో ఆలయ నిర్మాణం చేపట్టాలనే ఆవశ్యకత లేదు. భగవంతుని మందిర నిర్మాణం జరిగింది. ఆలయంలో ఐదు తత్వాలు ఉన్నాయి. పంచ తత్వాల్లో భ అంటే భూమి, గ అంటే గగన్​ (ఆకాశం), వ అంటే వాయువు (గాలి), అ అంటే అగ్ని, న అంటే నీరు. భ,గ,వ, అ, న అనే ఐదు తత్వాలు కలగలిపిన భగవంతుడు ఈ ఆలయంలో కొలువై ఉన్నాడు."
- స్థానికుడు.

ఇలాంటి హరిత ఆలయాలను దేశవ్యాప్తంగా నిర్మిస్తే.. భూతాప సమస్యను అధిగమించవచ్చన్నది స్థానికుల మాట.

ఇదీ చూడండి:వరుణుడి కరుణ కోసం 'కప్పల పెళ్లి'

ABOUT THE AUTHOR

...view details