తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​-శివసేన-ఎన్​సీపీ కూటమిపై అమిత్ షా ఫైర్​ - మహారాష్ట్ర ప్రభుత్వం

కాంగ్రెస్​-ఎన్సీపీ-శివసేన కూటమిపై విమర్శలు గుప్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అధికారం చేజిక్కించుకునేందుకు వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన పార్టీలు జట్టుకట్టాయన్నారు. భాజపాను అధికారానికి దూరం చేసేందుకు నైతికతను, నీతి, నిజాయతీలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు షా.

Shah on Maharashtra
అధికారం కోసం వ్యతిరేక భావజాల పార్టీల కుమ్మక్కు

By

Published : Nov 27, 2019, 8:04 PM IST

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్​-ఎన్సీపీ-శివసేన కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అధికారం చేజిక్కించుకునేందుకు వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన పార్టీలు చేతులు కలిపి.. మహారాష్ట్ర ప్రజల తీర్పును అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ ప్రైవేటు ఛానళ్​తో మాట్లాడిన సందర్భంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు షా. ఎన్నికల ముందు ఏర్పడిన భాజపా-శివసేన కూటమికి.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజలు ఓటు వేశారని అన్నారు. భాజపాను అధికారానికి దూరం చేయటానికి నైతికతను, నీతి నిజాయతీలను మరిచారని ఆరోపించారు షా.

" ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి మద్దతు తీసుకునేందుకు ఇది గుర్రపు వ్యాపారం కాదు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదనే విషయాన్ని మరోమారు స్పష్టం చేస్తున్నా. ఎన్నికల ప్రచారాల్లో ఉద్ధవ్​, ఆదిత్య ఠాక్రేలు సభలో ఉన్న సందర్భాల్లో దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటన చేశాం. అప్పుడు వారు దానిని ఎందుకు వ్యతిరేకించలేదు? ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. ప్రజలు ఇప్పటికీ భాజపాతోనే ఉన్నారు. "

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

మాతో కలిసినందునే గెలిచారు

తమతో కలిసి పోటీ చేసినందుకే శివసేన ఎమ్మెల్యేలంతా గెలిచారని అన్నారు షా. మోదీ చిత్రాలు లేకుండా ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవలేదని ఉద్ఘాటించారు. ఈ విషయం మహారాష్ట్రతో పాటు యావత్ దేశ ప్రజలకు తెలియనిదా? అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: రేపే ఠాక్రే ప్రమాణం.. అతిరథమహారథులకు ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details