తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అనుకోకుండా వచ్చి ఇలా గొంతు కలిపేసింది!

సంగీతం.. సృష్టిలో దీనికి పరవశించని జీవి లేదు. ఓ అద్భుత ప్రపంచంలో తేలియాడేలా చేయగల మహత్తు దీని సొంతం. ఎంతో మానసిక ఒత్తిడి ఉన్నా సంగీతం ఉపశమనం కలిగించగలదు. మరి రాగాలంటే మనలాంటి మనుషులకే కాదు పక్షులకూ ప్రాణమే. నమ్మట్లేదా? ఇందుకు సాక్ష్యమే ఈ కథనం.

parrot singing
చిలకగానం

By

Published : Jun 19, 2020, 5:24 PM IST

గట్టిగా శబ్దం చేస్తే పారిపోయే పక్షులు.. ఎక్కడి నుంచో వచ్చి కుదురుగా కూర్చొని సంగీతం వింటాయా? ఆ సరిగమలకు తగ్గట్లు గొంతెత్తుతాయా? పెంపుడు పక్షులైతే ఇలాంటివి చేయొచ్చు. కానీ అనుకోని అతిథిలా ఇంటికి వచ్చి... గిటార్​ వాయిస్తున్న ఓ వాద్యకారుడికి భయం బెరుకు లేకుండా తన గొంతు అరువిచ్చింది ఓ రామచిలుక.

ముంబయికి చెందిన జతిన్​ తెందుల్కర్​.. ఇటీవల ఓ రోజు ఉదయాన్నే లేచి కాలక్షేపం కోసం గిటార్​ వాయిస్తున్నాడు. మరి ఎక్కడినుంచి వచ్చాయో ఓ జంట చిలకలు అతడి ఇంటి కిటీకీలోకి తొంగిచూశాయి. అప్పటికే సంగీతం వాయిస్తూ ఉన్న జతిన్​ చూసి ముచ్చటపడ్డాయి. ఇంకేముంది అవి చక్కగా కాసేపు విన్నాయి. ఆ తర్వాత అందులో ఓ పక్షికి మనసు గొంతు విప్పి పాడాలనిపించిందేమో కానీ... వెంటనే ఆ సంగీతానికి తగ్గట్లు కూయడం మొదలెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశాడు జతిన్​. ఇంకేముంది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి మీరూ ఓ లుక్కేయండి.

ఇవీ చూడండి:

  1. టెన్నిస్‌ బ్యాట్​తో ఆడుతూనే హులా హూప్స్​
  2. 50 ఏళ్ల టీచరమ్మ.. బౌలింగ్​ అదిరిందమ్మా!
  3. ఆ నిచ్చెన ఎందుకు నడిచింది? ఆ ఫొటోలో ఉన్నవి దెయ్యాలా?
  4. బావిలోకి దిగి శునకాన్ని కాపాడిన మహిళ
  5. బైక్​పై హెల్మెట్​తో కుక్క రయ్​ రయ్​..!

ABOUT THE AUTHOR

...view details