రఫేల్ ఒప్పందం నచ్చకే పారికర్ రాజీనామా: పవార్ రఫేల్ యుద్ధ విమానాల ఒప్పంద విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్. రఫేల్‌పై ఏకాభిప్రాయం కుదరకనే గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్... రక్షణ మంత్రి పదవిని వదులుకున్నారని ఆరోపించారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో మోదీ విఫలమయ్యారని ఆరోపించారు.
" రఫేల్ ఒప్పందం మనోహర్ పారికర్‌కు నచ్చలేదు. అందువల్లే ఆయన రక్షణ మంత్రి పదవిని వదులుకుని గోవాకు తిరిగొచ్చారు."
-శరద్‌పవార్, ఎన్సీపీ అధినేత
దేశంలోని రాజాంగ్య సంస్థలను స్వలాభాలకోసం భాజపా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు పవార్. సాయుధ దళాలతో ప్రధానమంత్రి, భాజపా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్ షా ల కలయిక దేశానికి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్న మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనాధినేత రాజ్ ఠాక్రేను అభినందించారు. అది అక్షరాలా నిజమని పేర్కొన్నారు పవర్.