భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబరు 26న పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమంలో సందేశాన్ని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో నిర్వహించ తలపెట్టిన ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎంపీలే కాకుండా మాజీ రాష్ట్రపతులు, ప్రధానులను ఆహ్వానించే అవకాశముందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. నవంబరు 26న ఉదయం నిర్వహించే ఈ సమావేశం దాదాపు రెండు గంటలు జరిగే అవకాశముంది.