తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాలకు కరోనా సెగ - Parliament's Budget session likely to be concluded

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముందుగానే ముగిసిపోనున్నాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో 12 రోజుల ముందుగానే వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.

Parliament's Budget session likely to be concluded on Monday
పార్లమెంట్​ బడ్జెట్

By

Published : Mar 22, 2020, 11:10 PM IST

కరోనా వైరస్ సెగ భారత పార్లమెంట్​కు పాకింది. ప్రస్తుత బడ్జెట్​ సమావేశాలు సోమవారమే ముగియనున్నట్లు తెలుస్తోంది. రెండు సభల్లో ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన అనంతరం సమావేశాలకు ముగింపు పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగాల్సి ఉంది. అయితే దేశంలో కొవిడ్-19 విస్తృతి దృష్ట్యా 12 రోజుల ముందుగానే వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది.

తృణమూల్ కాంగ్రెస్, ఎన్​సీపీ సహా చాలా వరకు రాజకీయ పార్టీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పూర్తి నిర్బంధం విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉభయ సభలు వాయిదా పడటం లాంఛనమే అని తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details