తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ వాయు కాలుష్యంపై నేడు పార్లమెంటరీ కమిటీ భేటీ - లోక్​సభ స్పీకర్​ ఓం బీర్లా

దేశ రాజధానిలో అతి పెద్ద సమస్య అయిన  వాయు కాలుష్యంపై పార్లమెంటరీ కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ నెల 15న జరిగిన తొలి సమావేశానికి కమిటీ సభ్యుల్లో ఎక్కువశాతం మంది గైర్హాజరయ్యారు. దీనిపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో నేటి భేటీలో ఎంత మంది పాల్గొంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

దిల్లీలో వాయు కాలుష్యంపై నేడు పార్లమెంటరీ కమిటి భేటీ

By

Published : Nov 20, 2019, 5:31 AM IST

Updated : Nov 20, 2019, 11:04 AM IST

దిల్లీలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్య సమస్యపై నేడు పార్లమెంటరీ కమిటీ భేటీకానుంది. ఈ కమిటీకి భాజపా ఎంపీ జగదాంభికా పాల్​ అధ్యక్షత వహించనున్నారు.

నేడు జరిగే సమావేశంలో గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఎంసీడీ, డీడీఏ, ఎన్​డీఎంసీ, సీపీడబ్యూడీ, ఎన్​బీసీసీ.. వాయు కాలుష్యంపై తమ నివేదికలను కమిటీ సభ్యులకు సమర్పించనున్నాయి.

విమర్శలు... ఆగ్రహం

పార్లమెంటరీ కమిటీ సమావేశం జరగడం గత వారం రోజుల్లో ఇది రెండోసారి. నవంబర్​ 15న జరిగిన సమావేశానికి చాలా మంది కమిటీ సభ్యులు, సీనియర్​ ప్రభుత్వాధికారులు గైర్హాజరయ్యారు. ఈ జాబితాలో భాజపా ఎంపీ గౌతమ్​ గంభీర్​ కూడా ఉన్నారు. ముఖ్యమైన సమావేశానికి హాజరుకాకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు గైర్హాజరుకావటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. లోక్​సభ సభాపతి ఓం బిర్లాకు లేఖ రాశారు కమిటీ అధ్యక్షుడు.

హాజరుకావాల్సిందే...

గత సమావేశానికి రాని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోక్​సభ స్పీకర్​ ఓం బీర్లా. గైర్హాహాజరైన కమిటీ సభ్యులు, సీనియర్​ ప్రభుత్వాధికారులు నేడు జరిగే సమావేశానికి కచ్చితంగా హజరుకావాలని ఆదేశించారు స్పీకర్​.

నలుగురు మాత్రమే...

గత వారం జరిగిన సమావేశంలో 28 మంది కమిటి సభ్యుల్లో నలుగురు మాత్రమే హాజరయ్యారు. వారిలో కమిటి అధ్యక్షుడు పాల్​, ఆప్​ పార్టీ సభ్యులు సంజయ్​సింగ్​,హస్త్నెన్​ మసూది, భాజపా సభ్యుడ సీఆర్​ పాటిల్​ ఉన్నారు.

ఇదీ చూడండి:'గాంధీ'ల భద్రత కోసం కొత్తగా వెయ్యి మంది జవాన్లు!

Last Updated : Nov 20, 2019, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details