దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణ దాదాపు ఖాయమైంది. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సన్నాహాలు వేగవంతం చేశారు. భద్రత, భౌతిక దూరం పాటించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో చర్చించారు. పార్లమెంట్ సెక్యూరిటీ, సీపీడబ్ల్యూడీ, ఎన్‌డీఎంసీ, ఉభయసభల సెక్రెటరీ జనరల్స్, పార్లమెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ నుంచి సభ్యులను, సిబ్బందిని రక్షించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, మార్గదర్శకాలపై చర్చించారు. ప్రవేశ ద్వారాల వద్ద, పార్లమెంట్ భవనం లోపల, ఆవరణలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రత్యేక ఏర్పాట్లు