తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హర్షవర్ధన్​ వ్యాఖ్యలతో గందరగోళం- లోక్​సభ రేపటికి వాయిదా - పార్లమెంటు సమావేశాలు 2020

parliament
parliament

By

Published : Feb 7, 2020, 12:37 PM IST

Updated : Feb 29, 2020, 12:34 PM IST

14:09 February 07

లోక్​సభ రేపటికి వాయిదా

కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో లోక్​సభ రేపటికి వాయిదా పడింది. 

13:18 February 07

మళ్లీ వాయిదా...

వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్​సభలో మరోసారి గందరగోళం నెలకొంది. స్పీకర్​ ఎంత వారించినా సభ్యులు వారి స్థానాలకు వెళ్లకపోవడం వల్ల.. సభాపతి 2 గంటల వరకు సభను వాయిదా వేశారు.

12:09 February 07

లోక్​సభలో గందరగోళం... ఒంటిగంట వరకు వాయిదా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీపై కేంద్రమంత్రి హర్షవర్ధన్​ చేసిన వ్యాఖ్యలు.. లోక్​సభలో గందరగోళానికి దారి తీశాయి. సుమారు గంటపాటు ఈ పరిస్థితి నెలకొనడం వల్ల సభను వాయిదా వేశారు స్పీకర్​ ఓంబిర్లా. 

ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా రాహుల్ గాంధీ ఓ ప్రశ్న అడిగారు. దానికి సమాధానమిచ్చిన మంత్రి హర్షవర్ధన్​... ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని అన్యప్రాంతానికి చెందినవారని రాహుల్ పేర్కొనడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. 

హర్షవర్ధన్​ వ్యాఖ్యలతో వెల్​లోకి​ దూసుకొచ్చారు కాంగ్రెస్​ ఎంపీలు. మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ గందరగోళం కారణంగా సభ మధ్యాహ్నం ఒంటిగంట వరకు వాయిదా పడింది.

Last Updated : Feb 29, 2020, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details