వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులో ఒకటైన నిత్యావసర వస్తువుల సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. కొద్దిరోజుల క్రితమే లోక్సభ ఆమోదం పొందిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభ గడప దాటింది.
యుద్ధం వంటి ప్రత్యేక పరిస్థితులు, అసాధారణంగా ధరలు పెరగడం వంటి సందర్భాల్లో తప్ప చిరు ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్లు, కూరగాయలు సహా పలు నిత్యావసర వస్తువుల నిల్వ, సరఫరాపై ఎలాంటి నియంత్రణలూ ఉండబోవన్నది నిత్యావసర సరకుల చట్టసవరణ ప్రధానోద్దేశం.