రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీ)గా ఉన్న దమన్ దీవ్, దాద్రా నగర్ హవేలీని పరిపాలనా సౌలభ్యం తదితర కారణాలతో విలీనం చేయనుంది కేంద్రం. ఈ మేరకు రెండింటిని ఒకే యూటీగా మార్చే 2019-దాద్రానగర్ హవేలీ, దమన్ దీవ్ (కేంద్రపాలిత ప్రాంతాల విలీనం) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్సభ ఇదివరకే ఆమోదించగా.. తాజాగా మూజువాణి ఓటుతో పెద్దల సభ ఆమోదం తెలిపింది.
దమన్ దీవ్, దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు కేవలం 35 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ ఇరు ప్రాంతాలకు వేర్వేరు సచివాలయాలు ఉన్నాయి. దాద్రా నగర్ హవేలీలో ఒక జిల్లా ఉండగా... దమన్ దీవ్లో రెండు జిల్లాలు ఉన్నాయి.
కొత్తగా ఏర్పడే యూటీ పేరు.. దాద్రా నగర్ హవేలీ, దమన్ దీవ్గా మారనుంది. నూతన యూటీ ప్రధాన కేంద్రంగా దమన్ దీవ్ ఉండే అవకాశముంది.