తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెప్టెంబర్​ మొదటివారంలో పార్లమెంటు సమావేశాలు! - Parliament session latest news

పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ మొదటివారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలతో కొత్త సిట్టింగ్ ప్లాన్​ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు సభలు ఒకేసారి కాకుండా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో వేర్వేరుగా నిర్వహించనున్నట్లు సమాచారం.

PAR-SESSION
పార్లమెంటు సమావేశాలు

By

Published : Aug 18, 2020, 5:05 AM IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించటం కోసం రెండు ఛాంబర్లలో ఒకే సభను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు లోక్​సభ, రాజ్యసభ ఛాంబర్లను పరిశీలించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. సమావేశాల సన్నాహాలను సమీక్షించారు. కరోనా నేపథ్యంలో చేయాల్సిన మార్పులపై సూచనలు చేశారు. భౌతిక దూరం పాటించటం కోసం కొత్త సిట్టింగ్ ప్లాన్​ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం.

గ్యాలరీల్లోనూ..

రెండు ఛాంబర్లతో పాటు గ్యాలరీల్లోనూ ఎంపీలు కూర్చుంటారని రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. దీని ప్రకారం.. రాజ్యసభ సభ్యులు ఛాంబర్​లో 60 మంది, గ్యాలరీలో 51 మంది, లోక్​సభ ఛాంబర్​లో 132 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు.

లోక్​సభ సమావేశాలకూ ఇదే విధంగా ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. అయితే రెండు సభలు ఒకేసారి కాకుండా ఉదయం, మధ్యాహ్నం వేళల్లో వేర్వేరుగా నిర్వహించనున్నారు. 1952 తర్వాత ఇలా జరగటం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి:పార్లమెంట్‌ అనెక్స్‌ భవనంలో చెలరేగిన మంటలు

ABOUT THE AUTHOR

...view details