కరోనా ఉద్ధృతివేళ.. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గడువుకంటే వారం ముందే ముగిసే అవకాశం ఉంది. పలువురు కేంద్రమంత్రులు సహా 30 మంది ఎంపీలు కొవిడ్-19 బారిన పడిన వేళ.. కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు పార్లమెంటు అధికారులు తెలిపారు.
కరోనా ఉద్ధృతి వేళ పార్లమెంట్ సమావేశాల కుదింపు! - పార్లమెంట్
పార్లమెంట్ వర్షాకాల సామావేశాలు గడువు కంటే ఒక వారం ముందే ముగిసే అవకాశముంది. పులు కేంద్ర మంత్రులు, సిబ్బందికి కరోనా సోకడం వల్ల కేంద్రం ఈ విధంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
గడచిన 6 నెలల వ్యవధిలో తొలిసారి ఈ నెల 14న సమావేశమైన పార్లమెంటు ఉభయసభలు.. అక్టోబర్ 1 వరకు జరుగుతాయని తొలుత కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ పటేల్‌తో పాటు 30 మంది ఎంపీలకు కరోనా తేలడం వల్ల వర్షాకాల సమావేశాలను కుదించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే.. త్వరితగతిన బిల్లులను ఆమోదించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే సాగు బిల్లులను ఆమోదించుకున్న కేంద్రం.. శనివారం ఇన్‌సాల్వెన్సీ బిల్లును రాజ్యసభలో గట్టెక్కించుకుంది. వచ్చే బుధవారం వరకు మాత్రమే... సమావేశాలు జరుగుతాయని వినిపిస్తుండగా.. ఆ లోగా మిగిలిన అన్ని బిల్లులు ఆమోదించుకునేలా కేంద్రం వ్యూహరచన చేస్తోంది.
ఇదీ చూడండి:-దేశంలో నేరస్వామ్య దుర్రాజకీయం!