ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ రాజ్యాంగ ‘మౌలిక స్వరూపాన్ని’ మార్చే అధికారం లేదు. 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. వేర్వేరు సందర్భాల్లో రాజ్యాంగ మౌలిక లక్షణాలను పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది.
'ఏ అంశాన్నైనా సవరించవచ్చు... ఈ ఒక్కటి తప్ప' - br ambedkar
భారత రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా పార్లమెంటు సవరించవచ్చు. కాని ఒక అంశాన్ని మార్చే అధికారం మాత్రం లేదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదేంటో తెలుసుకోండి.
indian constitution
జాతి ఐక్యత, సమగ్రత, రాజ్యాంగ ఆధిక్యత, సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర వ్యవస్థ, రాజ్యాంగ లౌకిక స్వభావం, వ్యక్తి స్వేచ్ఛ, ఆత్మగౌరవం, న్యాయ సమీక్ష, నిష్పక్షపాత ఎన్నికలు, న్యాయాన్ని పొందే హక్కు, హేతుబద్ధత.. తదితరాలను మౌలిక లక్షణాలుగా ఇప్పటివరకు కోర్టు పేర్కొంది.
ఇదీ చూడండి: మహారాష్ట్ర ప్రభావం.. మధ్యప్రదేశ్‌లో ‘సింధియా’ హీట్!