తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్లమెంట్​: లోక్​సభలో 'హెగ్డే' దుమారం- కాంగ్రెస్ వాకౌట్​

parliament, budget
పార్లమెంటు

By

Published : Feb 4, 2020, 10:33 AM IST

Updated : Feb 29, 2020, 2:58 AM IST

13:45 February 04

రాజ్యసభలో నిర్భయ కేసు ప్రస్తావన

నిర్భయ కేసుకు సంబంధించి రాజ్యసభలో ఆమ్​ఆద్మీ పార్టీ ప్రస్తావించింది. దోషులకు మరణ శిక్ష అమలులో జరుగుతోన్న జాప్యంపై ఆక్షేపించారు ఆ పార్టీ ఎంపీ సంజయ్​ సింగ్​. ఈ విషయంలో రాష్ట్రపతి లేదా భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంజయ్​ సింగ్​ లేవనెత్తిన అంశంపై ఛైర్మన్​ వెంకయ్యనాయుడు స్పందించారు. ఇది చాలా సున్నితమైన విషయమని.. కోర్టు తీర్పును త్వరగా అమలు చేయాలని వ్యాఖ్యానించారు. 
 

13:06 February 04

రాజ్యసభ వాయిదా

రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు.

12:43 February 04

మేమే అసలైన గాంధీ భక్తులం: భాజపా

భాజపా పార్టీని రావణ రాజ్యమంటూ కాంగ్రెస్​ సభాపక్ష నేత అధీర్​ రంజన్​ చౌదురి వ్యాఖ్యలను తిప్పికొట్టారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి. 

"భారతీయ జనతా పార్టీకి చెందిన మేము.. అసలైన దేశభక్తులం. మహాత్మాగాంధీకి మేమే అసలైన అనుచరులం. వీళ్లంతా నకలీ గాంధీలైన సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ అనుచరులు."

- ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి 
 

12:28 February 04

కాంగ్రెస్ సభ్యుల వాకౌట్​

లోక్​సభలో విపక్షాల నిరసన తారస్థాయికి చేరింది. మహాత్మాగాంధీని అధికార పార్టీ నేత దుర్భాషలాడారని కాంగ్రెస్ సభాపక్షనేత అధీర్​ రంజన్​ చౌదురి ఆరోపించారు. దీనిపై చర్చించాలని కోరగా స్పీకర్​ ఓంబిర్లా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వాకౌట్​ చేశారు. 

మహాత్మాగాంధీపై భాజపా నేత అనంత్​కుమార్​ హెగ్డే వ్యాఖ్యలను కాంగ్రెస్​ సహా పలు విపక్ష పార్టీలు ఖండించాయి. హెగ్డే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. 
 

11:56 February 04

రాజ్యసభలో కొనసాగుతోన్న విపక్షాల ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. సభా కార్యక్రమాలు జరుగుతున్నా.. చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నాయి విపక్షాలు. 

11:38 February 04

ఎన్​ఆర్​సీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: కేంద్ర హోంశాఖ

జాతీయ పౌర పట్టికను దేశవ్యాప్తంగా అమలు చేసే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లోక్​సభలో అడిగిన ప్రశ్నకుగాను హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్​ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. 
 

11:27 February 04

రాజ్యసభలో 'దిల్లీ కాల్పుల'పై గందరగోళం

దిల్లీలో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలపై విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికార సభ్యులు వివిధ అంశాలపై ప్రసంగిస్తున్నా.. గోలీ చలానా బంద్​ కరో (తూటా పేల్చటం ఆపేయండి) అంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. 

11:17 February 04

లోక్​సభలో 'హెగ్డే' వ్యాఖ్యల దుమారం-వాయిదా

మహాత్మాగాంధీపై భాజపా ఎంపీ అనంతకుమార్​ హెగ్డే చేసిన వ్యాఖ్యలు లోక్​సభ దుమారం లేపాయి. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్​సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు సభాపతి. 
 

11:11 February 04

పార్లమెంటులో నేడు..

లోక్​సభ: ఎయిర్​క్రాఫ్ట్ సవరణ చట్టం-2020ను ప్రవేశపెట్టనున్న కేంద్రం

రాజ్యసభ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం

10:59 February 04

'ఒకే దేశం-ఒకే ఎన్నిక' పై భాజపా ఎంపీ నోటీసు

రాజ్యసభ శూన్య గంటలో 'దేశంలో జమిలీ ఎన్నికల అవసరం'పై చర్చించాలని భాజపా ఎంపీ సరోజ్​ పాండే నోటీసు ఇచ్చారు. 

10:54 February 04

హెగ్డే వ్యాఖ్యలపై వాయిదా తీర్మానం

మహాత్మాగాంధీపై భాజపా నేత అనంతకుమార్​ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ ఎంపీలు.. లోక్​సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్​ గొగొయి, కె.సురేశ్​, అబ్దుల్ ఖాలీఖ్​ హెగ్డే వ్యాఖ్యలను ఖండించారు. 

10:48 February 04

లోక్​సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం

లోక్​సభలో కాంగ్రెస్​ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పౌరచట్టం కారణంగా దేశంలో భయానక వాతావరణం ఏర్పడిందని ఎంపీలు అధిర్​ రంజన్​ చౌదురి, మాణికం ఠాగూర్​ ఆరోపించారు. 

09:39 February 04

భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ

పార్లమెంటు భవనంలో భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. భేటీకి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. బడ్జెట్​తోపాటు పౌరచట్టానికి సంబంధించి ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై చర్చించినట్లు సమాచారం.

Last Updated : Feb 29, 2020, 2:58 AM IST

ABOUT THE AUTHOR

...view details