తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఐఏ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం - రాజ్యసభ

ఎన్​ఐఏ చట్టసవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్​సభలో నెగ్గిన బిల్లు నేడు రాజ్యసభలో మూజువాణి ఓటుతో పాసయింది.

పార్లమెంటు

By

Published : Jul 17, 2019, 8:44 PM IST

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) చట్ట సవరణ బిల్లు-2019కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్​సభ ఆమోదించగా నేడు రాజ్యసభలో మూజువాణి ఓటుతో నెగ్గింది.

ఈ బిల్లుతో ఉగ్రవాదులకు భారత్​ నుంచి గట్టి సందేశం చేరుతుందని రాజ్యసభలో ఉద్ఘాటించారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా. ఎన్​ఐఏ చట్టాన్ని మోదీ సర్కార్​ ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయదని అమిత్​ షా స్పష్టం చేశారు.

ఏమిటీ బిల్లు?

బిల్లు ఆమోదంతో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోని భారతీయులపై ఉగ్రదాడుల దర్యాప్తునకు అనుమతి లభించినట్లయింది. సైబర్​ నేరాలు, మానవ అక్రమ రవాణాపైనా దర్యాప్తు చేయడానికి ఈ సవరణలు అనుమతిస్తాయి.

ఇదీ చూడండి: ఎన్​ఐఏ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details