చైనాపై డిజిటల్ యుద్ధంలో భాగంగా ఆ దేశానికి చెందిన మరో 118 యాప్‌లపై భారత్ బుధవారం నిషేధం విధించింది. ఈ జాబితాలో ప్లేయర్స్ అన్‌కౌన్ బ్యాటిల్‌గ్రౌండ్ (పబ్జీ) గేమ్ కూడా ఉంది.
ఈ మొబైల్ గేమ్‌ను ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకోగా.. 5 కోట్ల మంది యాక్టివ్ గేమర్లు ఉన్నారు. ముఖ్యంగా భారత్‌లో యువత దీనికి అధికంగా ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం బ్యాన్ నేపథ్యంలో యువత, పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని బెంగళూరుకు చెందిన మానసిక వైద్య నిపుణులు జగదీశ్ సూచిస్తున్నారు.
ఇలా చేస్తే విముక్తి!
ఇప్పటివరకు రోజూ గంటల తరబడి పబ్జీ ఆడిన వాళ్లు ఒక్కసారిగా మానేయడం కష్టమే అన్నారు జగదీశ్. ఫలితంగా తలెత్తే మానసిక సమస్యలను ఎదుర్కొనేందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి...
1. నిత్యం వ్యాయామం చేయడం.
2. పోషకాహారం తీసుకోవడం.
3. వేళకు నిద్రపోవడం.
4. సోషల్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేందుకు ప్రయత్నించడం.
5. కుటుంబంతో సరదాగా గడపడం.
ఇవన్నీ చేసినా పబ్జీ నుంచి దృష్టి మరల్చుకోలేని వారు మానసిక నిపుణుల్ని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు జగదీశ్.
డా. జగదీశ్, మానసిక వైద్య నిపుణులు "భారత్‌లో చాలా మంది టీనేజర్లు ఈ ఆటకు బానిసగా ఉన్నారు. ఇది వారిలో మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది. ముఖ్యంగా గేమర్ల సామాజిక జీవనంపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యసనాన్ని పారదోలేందుకు పిల్లలకు వారి తల్లిదండ్రులు సాయం అందించాలి. ఈ సమస్యను అధిగమించేందుకు కృషి చేయాలి". -జగదీశ్.
లాక్డౌన్లో 9 వేల కోట్లు..
పబ్జీ చైనాకు చెందిన యాప్ అయినా.. దక్షిణ కొరియాకు చెందిన బ్లూహోల్ సంస్థ దీని సర్వర్లను నిర్వహిస్తోంది. పబ్జీ మొబైల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అర్ధవార్షికంలో వచ్చిన ఆదాయం రూ.9,731 కోట్లు. ఇప్పటివరకు మొత్తం ఈ గేమ్ ద్వారా రూ.22,457 కోట్లు ఆర్జించినట్లు అంచనా.
మొదటి నిషేధిత జాబితాలో పబ్జీ లేకపోవటం వల్ల యూజర్లను మరింత పెంచుకునే లక్ష్యంతో కొత్త గేమింగ్‌ను ప్రారంభించింది. పబ్జీ మొబైల్ గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌తో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా గెలిచిన వారికి రూ.15 కోట్లు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొద్దిరోజులకే భారత్ యాప్‌ను నిషేధిత జాబితాలోకి చేర్చింది.
ఇదీ చూడండి:పబ్జీ.. ఇది ఆటా లేక యమ పాశమా?