నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను నిరోధించేందుకు ఆధార్‌తో అనుసంధానించాలనే ఎన్నికల సంఘం(ఈసీ) ప్రతిపాదనకు పార్లమెంటరీ కమిటీ శుక్రవారం మద్దుతు తెలిపింది. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు స్థాయి సంఘం పేర్కొంది
ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఆధార్ అనుసంధానం చేయాలని ఈసీ ప్రతిపాదన చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు, ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్నవారి నుంచి కూడా ఆధార్ అనుసంధానించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను సవరించాలని గతేడాది ఆగస్టులోనే పోల్ ప్యానెల్‌ను ప్రతిపాదించింది.