58 పాత కేంద్ర చట్టాలను రద్దు చేసేందుకు రూపొందించిన 'చట్టాల రద్దు, సవరణల బిల్లు-2019'కి పార్లమెంటు ఆమోద ముద్ర లభించింది. శుక్రవారం రాజ్యసభలో మూజువాణి ఓటు ద్వారా నెగ్గింది. జులై 29న ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
భాజపా అధికారంలోకి వచ్చిన అనంతరం నిరుపయోగంగా ఉన్న చట్టాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 1824 పాత చట్టాలను గుర్తించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇలా పాత చట్టాలను గుర్తించి, వాటిని రద్దుచేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లుకు పార్టీలకు అతీతంగా పలువురు సభ్యులు మద్దతు తెలిపారు.