క్వారంటైన్ కేంద్రం నుంచి కాపాడిన ఒక అలుగుకు... కొవిడ్-19 పరీక్ష చేయాలని ఒడిశా అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ఇటీవల ఒడిశా కటక్ జిల్లాలోని మహౌలియా క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఒక అలుగును అథాగడ్ అటవీ డివిజన్ అధికారులు కాపాడారు.
క్వారంటైన్ కేంద్రం నుంచి కాపాడిన అలుగుకు కరోనా! - Odisha forest officers rescued pangolin
ఒడిశా కటక్ జిల్లాలోని మహౌలియా క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఒక అలుగును (పంగోలిన్) అథాగడ్ అటవీ డివిజన్ అధికారులు కాపాడారు. ఆ పాంగోలిన్ నిర్బంధ కేంద్రంలో ఉన్నందున కరోనా సోకిందని అనుమానం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోని అలుగుకు కరోనా పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
క్వారంటైన్ కేంద్రం నుంచి కాపాడిన అలుగుకు కరోనా!
స్థానిక సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో అలుగును తీసుకెళ్లారు అధికారులు. క్వారంటైన్ కేంద్రంలో ఉన్నందున కరోనా సోకిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అలుగుకు కూడా కొవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఒక పాంగోలిన్‌కు కరోనా పరీక్ష చేయాలని నిర్ణయించడం ఇదే తొలిసారని ఒడిశా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. పాంగోలిన్ ద్వారా వైరస్ విస్తరిస్తుందని అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇదీ చూడండి:భారీ వర్షాలతో నీటమునిగిన జనావాసాలు