తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసెంబ్లీ స్పీకర్ల సారథ్యంలో ఎమ్మెల్యేల నిబంధనలు..! - లోక్​సభ

పార్లమెంట్ వేదికగా అన్ని రాష్ట్రాల శాసనసభాపతులతో నేడు సమావేశమయ్యారు లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు స్పీకర్లతో కూడిన ఓ కమిటీని ఏర్పాటుచేసి... చట్టసభ సభ్యులకు ప్రవర్తనా నియమావళిని రూపొందిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేలను మరింత సమర్థులుగా తయారుచేసేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

అసెంబ్లీ స్పీకర్ల సారథ్యంలో ఎమ్మెల్యేల నిబంధనలు..!

By

Published : Aug 28, 2019, 11:00 PM IST

Updated : Sep 28, 2019, 4:13 PM IST

రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేసి శాసనసభల్లో ఎమ్మెల్యేలు పాటించాల్సిన ప్రవర్తనా నియమావళిని రూపొందిస్తామన్నారు లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా. చట్ట సభ సభ్యులను మరింత సమర్థులుగా తయారుచేసి... వాయిదాలను నివారించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

పార్లమెంట్‌ వేదికగా రాష్ట్రాల శాసనసభాపతులతో సదస్సు నిర్వహించారు లోక్​సభ స్పీకర్.

ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీ స్పీకర్లు, శాసనమండలి ఛైర్​పర్సన్​లు హాజరయ్యారు.

రాష్ట్రాల స్పీకర్లతో సమావేశం ఫలప్రదంగా జరిగిందని... ప్రజాప్రతినిధుల్లో సమర్థతను పెంచేందుకు నూతన నిబంధనలను రూపొందించాల్సిందేనని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించారు ఓం బిర్లా. శాసనసభ కార్యకలాపాలు సజావుగా సాగాలని స్పీకర్లు అభిప్రాయపడినట్లు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల శాసనసభల డిజిటలైజేషన్ ప్రక్రియల గురించి చర్చించామని... ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు లోక్​సభ స్పీకర్​.

పార్లమెంటు ఉభయసభల సభ్యులకు ప్రవర్తన నియమావళిని రూపొందిస్తామని ఇంతకుముందే ప్రకటించారు ఓం బిర్లా.

ఇదీ చూడండి: ఆచితూచి వేయాలి అడుగు..!

Last Updated : Sep 28, 2019, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details