తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డబుల్ ధమాకా: పెళ్లి రోజే ప్రమాణ స్వీకారం - kerala panchayat member marraige

2020, డిసెంబర్​ 22.. కేరళకు చెందిన సజాద్ సలీమ్​​కు జీవితంలో ఎంతో విశేషమైన రోజుగా నిలిచింది. ఎందుకంటే సజాద్​ ఇదే రోజు పంచాయతీ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయటమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నారు. అటు పదవి, ఇటు భార్య ఒకే రోజు తన జీవితంలోకి వచ్చినందుకు సజాద్ పట్టరాని సంతోషంతో ఉన్నారు.

panchayath member wedding kolaam
డబుల్ ధమాకా..పెళ్లి రోజే ప్రమాణ స్వీకారం

By

Published : Dec 22, 2020, 5:12 PM IST

డబుల్ ధమాకా..పెళ్లి రోజే ప్రమాణ స్వీకారం

కేరళ కొల్లం జిల్లా త్రిక్కోవిల్వత్తమ్​కు చెందిన సజాద్​ సలీమ్​ జీవితంలో మరపురాని రోజుగా మిగిలింది 2020, డిసెంబర్​ 22. ఎందుకంటే అనకోకుండా అజాద్​ ప్రమాణ స్వీకారం, పెళ్లిరోజు ఒకే రోజు వచ్చింది. ముందు పంచాయతీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం పూర్తి చేసి నేరుగా పెళ్లికూతురు ఇంటికి వెళ్లి వివాహం చేసుకున్నారు సజాద్.

సజాద్-అన్సీ వివాహం డిసెంబర్​ 22న జరపాలని కొన్ని నెలల క్రితమే నిశ్చయించారు పెద్దలు. అయితే ఇటీవల కేరళలో జరిగిన మున్సిపల్​ ఎన్నికల్లో త్రిక్కోవిల్వత్తమ్​ 8వ వార్డు​ నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించారు సజాద్​.

ఇదీ చదవండి :'కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రాణాంతకం కాదు.. భయమొద్దు'

ABOUT THE AUTHOR

...view details