తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పారికర్​కు కడసారి వీడ్కోలు - నిర్మలా సీతారామన్

గోవా ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ అంత్యక్రియలు గోవా మిరామర్ బీచ్​లో అధికారిక లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. తమ ప్రియతమ నేతకు అశేష జనవాహిని కన్నీటి వీడ్కోలు పలికింది.

పారికర్​కు కడసారి వీడ్కోలు

By

Published : Mar 18, 2019, 7:09 PM IST

Updated : Mar 19, 2019, 8:02 PM IST

పారికర్​కు కడసారి వీడ్కోలు
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్​ అంత్యక్రియలు గోవా మిరామర్​ తీరంలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ప్రియతమ నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు అశేష జనవాహిని తరలివచ్చింది.

హాజరైన అగ్రనేతలు

ప్రధాని నరేంద్ర మోదీ పారికర్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్​ భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మిరామర్​కు చేరుకుని పారికర్​ అంతిమయాత్రకు హాజరయ్యారు.

అంతిమ యాత్ర

అనారోగ్యంతో కన్నుమూసిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్​ను ఉదయం పనాజీలోని భాజపా కార్యాలయం నుంచి ప్రజల సందర్శనార్థం కళా అకాడమీకి చేర్చారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ యాత్ర ప్రారంభించి మిరామర్​ తీరానికి చేర్చారు. మిరామర్​ బీచ్​లోని గోవా మొదటి ముఖ్యమంత్రి దయానంద్​ బండోద్కర్​ స్మారక చిహ్నం పక్కనే పారికర్​ అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అధికారిక లాంఛనాలతో కడసారి వీడ్కోలు పలికారు.

Last Updated : Mar 19, 2019, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details