తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్' - palaniswami announced covid vaccine in free of cost of tn people

తమిళనాడులో ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్​ను ఉచితంగా అందిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి పళనిస్వామి. ఇందుకు సంబంధించిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

Palaniswami assures free COVID-19 vaccine to TN people
'ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్'

By

Published : Oct 22, 2020, 7:23 PM IST

Updated : Oct 22, 2020, 7:56 PM IST

తమిళ ప్రజలకు సీఎం పళనిస్వామి శుభవార్త చెప్పారు. కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఉచితంగా దాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు. అందుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

పళనిస్వామి

అయితే ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్​ మాట్లాడుతూ.. టీకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరో ఆరు నెలల సమయం పడుతుందని అన్నారు.

ఎన్నికలు సమీపిస్తుండడం వల్ల రాజకీయ పార్టీలు అన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీకా మంత్రం జపిస్తున్నాయి. బిహార్​ ఎన్నికలకు సంబంధించి భాజపా తన మేనిఫెస్టోలో బిహార్​ ప్రజలకు వ్యాక్సిన్​ అందించడంమే తమ ప్రధానాంశమని స్పష్టం చేసింది.

ఇదీచూడండి: 'బిహార్​ ప్రజలకు ఉచితంగా కొవిడ్​-19 వ్యాక్సిన్'​

Last Updated : Oct 22, 2020, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details