కశ్మీర్లోని రాజౌరీ జిల్లాకు చెందిన భద్రతా దళాల సంయుక్త బృందం.. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. డ్రోన్ల ద్వారా పాక్ నుంచి తరలిస్తున్న ఆయుధాలను తీసుకుంటుండగా ముష్కరులు పట్టుబడ్డారు. నిందితుల నుంచి రెండు ఏకే-56 రైఫిల్స్, 2 పిస్టల్స్, 4 గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రి సహా.. లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కశ్మీర్లో శాంతికి భంగం కలిగించేందుకుగానూ.. పొరుగు దేశం డ్రోన్ల సాయంతో ఇలా దేశంలో ఆయుధాలను వదులుతోందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్లో పట్టుబడ్డ ముగ్గురిలో ఓ ఉగ్రవాదిది షోపియాన్. ఇతడు 2020 జూన్ 4న ఉగ్రవాద ముఠాతో చేతులు కలిపాడు. మిగతా ఇద్దరిదీ పుల్వామా అని గుర్తించారు.
ఇది మూడోసారి..