తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐరాస వేదికగా కశ్మీర్​పై పాక్​ ప్రయత్నాలు విఫలం' - united nations

ఐరాస మానవ హక్కుల సంఘం ముందు కశ్మీర్​ అంశాన్ని రాజకీయం చేయాలన్న పాక్​ ప్రయత్నం బెడిసికొట్టిందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. పదేపదే అబద్ధాలు చెప్పినంత మాత్రాన అవి నిజాలు కావని హితవు పలికింది.

'ఐరాస వేదికగా కశ్మీర్​పై పాక్​ ప్రయత్నాలు విఫలం'

By

Published : Sep 12, 2019, 6:57 PM IST

Updated : Sep 30, 2019, 9:13 AM IST

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం (యూఎన్​హెచ్​ఆర్​సీ)లో పాకిస్థాన్​కు ఎదురుదెబ్బతగిలింది. కశ్మీర్​ అంశాన్ని రాజకీయం చేయాలన్న పాక్​ ప్రయత్నాలు బెడిసికొట్టినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. పాక్​ వాదనలను యూఎన్​హెచ్​ఆర్​సీ తిరస్కరించినట్లు ప్రకటించింది.

తప్పును పదేపదే చెబితే నిజం కాదన్న విషయాన్ని పాకిస్థాన్​ గుర్తుంచుకోవాలని హితవు పలికారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ ​కుమార్​. ఐరాసలో పాక్​ చెప్పిన అబద్ధాలపై భారత్​ దీటుగా బదులిచ్చిందని తెలిపారు.

రవీశ్​ కుమార్​, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి

" కశ్మీర్​ అంశాన్ని రాజకీయం చేయాలన్న పాక్​ ప్రయత్నం తిరస్కరణకు గురైంది. ఉగ్రవాదులను పెంచి పోషించి, వారికి సహకరించే విషయంలో పాకిస్థాన్​ పాత్ర గురించి అంతర్జాతీయ సమాజానికి స్పష్టమైన అవగాహన ఉంది. ఉగ్రవాదానికి కేంద్రంగా మారిన దేశం మానవ హక్కులపై ప్రపంచ సమాజం తరఫున మాట్లాడటం విడ్డూరంగా ఉంది."

- రవీశ్​ కుమార్​, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి.

ఐరాస మానవహక్కుల మండలిలో ఇరుదేశాల మధ్య కశ్మీర్​ అంశంపై మాటల యుద్ధం జరిగిన రెండు రోజుల తర్వాత ఈ మేరకు స్పందించారు రవీశ్​​ కుమార్​.

ఇదీ చూడండి: అంతరిక్షంలో సిమెంట్​ మిక్స్​ చేసిన వ్యోమగాములు!

Last Updated : Sep 30, 2019, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details