తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాకిస్థానీలకు కశ్మీర్​ కంటే ఆ రెండే అతిపెద్ద సమస్యలు - imran khan

పాకిస్థానీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కశ్మీర్ అంశం కాదని ఓ సర్వేలో తేలింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే వారికి అత్యంత క్లిష్టమైన సమస్యలని వెల్లడైంది.

పాకిస్థానీలకు కశ్మీర్​ కంటే ఆ రెండే అతిపెద్ద సమస్యలు

By

Published : Nov 1, 2019, 4:35 PM IST

Updated : Nov 1, 2019, 4:49 PM IST

కశ్మీర్​ కోసం ఎంతవరకైనా వెళ్తామని పాకిస్థాన్ ప్రధాని బీరాలు పలుకుతున్నా.. ఆ దేశంలో వాస్తవ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. పాక్ ప్రజలకు కశ్మీర్ అంశాన్ని ప్రధాన సమస్యగా భావించడం లేదని ఓ సర్వే తెలిపింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న పాక్​లో.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని ప్రజలు అతిపెద్ద సమస్యలుగా భావిస్తున్నట్లు గాలప్​-గిలానీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

కశ్మీర్​కు 8 శాతం ప్రజలే...

పాక్​లో 53శాతం మంది ప్రజలు.. ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. 23శాతం మంది ప్రజలు నిరుద్యోగాన్ని, 4శాతం మంది ప్రజలు అవినీతిని, మరో 4శాతం మంది ప్రజలు నీటి సంక్షోభాన్ని సమస్యలుగా భావిస్తున్నట్లు సర్వే పేర్కొంది.

కశ్మీర్​ అంశాన్ని అంతర్జాతీయంగా లేవనెత్తాలని తీవ్రంగా శ్రమిస్తున్న పాక్​ ప్రభుత్వానికి 8 శాతం మంది ప్రజలు మాత్రమే మద్దతుగా ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది.
పాక్​లోని బలూచిస్థాన్​, ఖైబర్​ పక్తుంక్వా, పంజాబ్​, సింధ్​ ప్రాంతాల్లో పురుషులు, మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు గాలప్​-గిలానీ సర్వే తెలిపింది.

తీవ్ర ఆర్థిక సంక్షోభం..

గత కొద్ది సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది పాక్​. ఒకానొక సమయంలో 8 బిలియన్ డాలర్ల కంటే తక్కువ కరెన్సీ నిల్వ కలిగి ఉంది. ఇది 1.7 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతుంది.

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఐఎంఎఫ్​తో ఈ ఏడాది 6 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది పాక్​. ఐఎంఎఫ్​తో పాటు ఖతార్, చైనా, సౌదీ అరేబియా, ఈఏఈ దేశాల నుంచి ఆర్థిక సాయం అందుకుంది.

ఇదీ చూడండి: దిల్లీపై కాలుష్యం పంజా- ఐదు రోజులు అన్నీ బంద్​

Last Updated : Nov 1, 2019, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details