పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి.. పూంఛ్ జిల్లాలో ఆ దేశ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ చర్యకు భారత్ దీటుగా సమాధానమిచ్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్
జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి పూంఛ్ జిల్లాలో పాకిస్థాన్ ఆర్మీ మరోసారి కాల్పులకు పాల్పడింది. ఈ చర్యకు దీటుగా స్పందించినట్లు భారత సైన్యం పేర్కొంది.
కాల్పుల ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించిన పాక్
తెల్లవారుజామున పూంఛ్ జిల్లాలోని మాన్‌కోట్, మేఢర్ సెక్టార్లో పాకిస్థాన్ కాల్పులు జరిపిందని భారత ప్రతినిధి తెలిపారు. అక్టోబర్ 1న కూడా పాకిస్థాన్ కాల్పులకు పాల్పడిందని.. ఆ కాల్పుల్లో ఓ భారత ఆర్మీ జవాను మృతి చెందాడని పేర్కొన్నారు.