తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కర్తార్​పుర్'​ పనులు కొనసాగుతాయన్న పాక్ - coridor will be continue

కశ్మీర్​పై భారత్​ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ దౌత్య సంబంధాలను రద్దు చేసుకుంది పాకిస్థాన్​. కానీ కర్తార్​పుర్​ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించింది. ఈ ప్రాజెక్టు సందర్శించడానికి పంజాబ్​ ప్రతినిధులకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది.

కర్తార్​పుర్​ ప్రాజెక్టు పనులు కొనసాగుతాయన్న పాక్

By

Published : Aug 9, 2019, 1:15 PM IST

భారత్​తో దౌత్య సంబంధాలు రద్దు చేసుకున్న పాక్​.. కర్తార్​పుర్​ ప్రాజెక్టును మాత్రం పూర్తి చేస్తామని తెలిపింది. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన రోడ్లు, వంతెన, భవనాల నిర్మాణ పనులను పాకిస్థాన్ 90 శాతం పూర్తి చేసింది.

పాక్​ అన్ని మతాల వారిని గౌరవిస్తుంది. కర్తార్​పుర్​ ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేస్తుంది
-పాక్​ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి

ఈ ప్రాజెక్టు పూర్తయితే సిక్కులు అత్యంత పవిత్రమైన ప్రాంతంగా భావించే పాకిస్థాన్​ కర్తార్​పుర్‌లోని గురుద్వారా దాదర్​ సాహిబ్​కు నేరుగా రాకపోకలు జరపటానికి వీలవుతుంది.

పాక్​కు పంజాబ్ ప్రతినిధుల బృందం

కర్తార్​పుర్​ కారిడార్​ ప్రాజెక్ట్​ సందర్శించి పనుల పురోగతిని తెలుసుకోవడానికి పంజాబ్​ ప్రతినిధులకు కేంద్రం నుంచి అనుమతి లభించిందని రాష్ట్ర మంత్రి సుఖ్​జిందర్​ సింగ్​ రాఘవ తెలిపారు. ప్రాజెక్టుతో పాటు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ను కలవడానికి పంజాబ్​ ప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు అనుమతి లభించిందని మంత్రి అన్నారు.

2018లో ఒప్పందం

2018 నవంబర్​లో కర్తార్​పుర్​ ప్రాజెక్టు నిర్మించాలని పాకిస్థాన్​-భారత్​ ఒప్పందాలు చేసుకున్నాయి. గురునానక్ 550వ జన్మదినోత్సవమైన 2019 నవంబర్‌ 12 లోపు కర్తార్‌పుర్‌ ప్రాజెక్టును పూర్తి చేసి రాకపోకలు జరపాలని పాక్​ను కోరింది భారత్‌.

ఇదీ చూడండి:మోదీ ప్రసంగం: భాజపా ప్రశంస- భరోసా ఇవ్వలేదన్న కాంగ్రెస్​

ABOUT THE AUTHOR

...view details