తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ సంఝౌతా వస్తోంది

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన సంఝౌతా ఎక్స్​ప్రెస్ సేవలను పాక్ తిరిగి ప్రారంభించింది.

పాక్​ సంఝౌతా వస్తోంది

By

Published : Mar 4, 2019, 1:43 PM IST

Updated : Mar 4, 2019, 3:25 PM IST

మెరుపు దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తాత్కాలికంగా నిలిపివేసిన సంఝౌతా ఎక్స్​ప్రెస్​ సేవలను పునరుద్ధరించింది.​ సోమవారం లాహోర్​ రైల్వే స్టేషన్​ నుంచి 150 మంది ప్రయాణికులతో సంఝౌతా ఎక్స్​ప్రెస్​ రైలు దిల్లీకి బయలుదేరిందని పాకిస్థాన్​ ప్రభుత్వం తెలిపింది.

పాక్​ సంఝౌతా వస్తోంది

ఇరు దేశాల మధ్య సంఝౌతా ఎక్స్​ప్రెస్ సేవలను పునర్ ​ప్రారంభించేదుకు పాక్ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని భారత రైల్వే అధికారులు సోమవారం ఉదయం ప్రకటించారు.

భారత వాయుసేన బాలాకోట్​లో ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన దాడుల అనంతరం ఫిబ్రవరి 28 నుంచి సంఝౌతా సేవలను పాకిస్థాన్ నిలిపివేసింది.

1971 యుద్ధం అనంతరం భారత్​-పాక్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో భాగంగా 1976 నుంచి ఈ రైలు సేవలు ప్రారంభమయ్యయి. ప్రతి సోమ, గురువారాల్లో లాహోర్ నుంచి దిల్లీ వస్తుంది సంఝౌతా ఎక్స్​ప్రెస్​. భారత్ సంఝౌతా సేవలను దిల్లీ నుంచి అటారీ వరకు కల్పిస్తోంది. ప్రతి బుధ, ఆదివారాల్లో ఈ ఎక్స్​ప్రెస్​ దిల్లీ నుంచి అటారీ వెళ్తుంది.

సంఝౌతాలో సాధారణంగా 70 శాతంగా ఉండే ప్రయాణికుల సంఖ్య పుల్వామా ఘటన అనంతరం భారీగా తగ్గింది. భారత్-పాకిస్థాన్​లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే కారణం.

Last Updated : Mar 4, 2019, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details