తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత దౌత్యాధికారులకు జాదవ్​ను కలిసే అవకాశం​ - కుల్​భూషణ్ జాదవ్

భారత మాజీ నౌకాదళ అధికారి కుల్​భూషణ్​ను శుక్రవారం భారత దౌత్యాధికారులు కలిసేందుకు పాకిస్థాన్​ ప్రభుత్వం అవకాశం ఇవ్వనుంది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు మేరకు పాక్ ఈ నిర్ణయం తీసుకుంది.

జాదవ్​

By

Published : Aug 1, 2019, 4:13 PM IST

Updated : Aug 2, 2019, 2:27 AM IST

పాక్​ చెరలో ఉన్న భారత మాజీ నౌకాదళ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​ను రేపు భారత దౌత్యధికారులు కలిసేందుకు అవకాశం ఇవ్వనుంది. ది హేగ్​లోని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుననుసరించి జాదవ్​ను కలిసేందుకు పాకిస్థాన్​ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు పాక్​ విదేశాంగ శాఖ ప్రతినిధి మహ్మద్​ ఫైజల్​ ప్రకటన విడుదల చేశారు.

దౌత్య మార్గంలో వెళతాం: భారత్​

పాక్​ ప్రకటనను భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. పాక్​ ప్రకటనపై దౌత్య మార్గం ద్వారా సంప్రదిస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్​ తెలిపారు.

ఐసీజే తీర్పు

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్​లో జైలు జీవితం గడుపుతున్న కుల్​భూషణ్​ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం జులై 17న తీర్పు వెలువరించింది. కుల్​భూషణ్​కు విధించిన మరణ శిక్షను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ కేసును పునఃసమీక్షించాలని పాక్​కు స్పష్టం చేసింది ఐసీజే. జాదవ్​కు న్యాయవాదిని కలిసే హక్కు ఉందని తేల్చి చెప్పింది.

ఐసీజే తీర్పు అనంతరం వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్య అధికారులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని జులై 26న పాక్​ను భారత్​ డిమాండ్ చేసింది.

ఇదీ కేసు

భారత నావికాదళ మాజీ అధికారిని ఇరాన్​లో వ్యాపారం నిర్వహిస్తుండగా 2016లో పాక్​ ఏజెంట్లు అపహరించారు. ఆ తర్వాత పాక్​లోకి ప్రవేశిస్తుండగా బలోచిస్థాన్​లో అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. విచారించిన పాక్​ సైనిక న్యాయస్థానం 2017లో జాదవ్​కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

ఇదీ చూడండి: జాదవ్​తో మాట్లాడేందుకు అనుమతికి భారత్​ డిమాండ్

Last Updated : Aug 2, 2019, 2:27 AM IST

ABOUT THE AUTHOR

...view details