తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పీఓకేలో ఉగ్రవాదుల ప్రభుత్వమే నడుస్తోంది: రావత్​

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఉగ్రవాదుల చేతుల్లో ఉందని సైన్యాధ్యక్షుడు బిపిన్‌ రావత్‌ ఆరోపించారు. జమ్ము కశ్మీర్​ స్వయం ప్రతిపత్తి రద్దును సమర్థించారు. ఈ నిర్ణయంతో జమ్ముకశ్మీర్​ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

బిపిన్​ రావత్​, భారత సైన్యాధిపతి

By

Published : Oct 25, 2019, 7:51 PM IST

Updated : Oct 25, 2019, 10:49 PM IST

పీఓకేలో ఉగ్రవాదుల ప్రభుత్వమే నడుస్తోంది

పీఓకేను నియంత్రిస్తున్న ఉగ్రవాదులు కశ్మీర్​లో సాధారణ స్ధితి ఏర్పడకుండా ప్రయత్నిస్తున్నారని సైన్యాధిపతి బిపిన్​ రావత్​ ఆరోపించారు. యాపిల్​ వర్తకులను, రవాణా కోసం వచ్చిన బయటి రాష్ట్రాల వారిని హత్య చేస్తున్నారని.. కొద్దిగా ఆలస్యమైనా మన సైనికులు ఈ సమస్యను పరిష్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

తొలి సైనికాధిపతి కె.ఎం.కరిపయప్ప స్మారకార్థం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు రావత్​. ఈ సందర్భంగా సియాచిన్ గ్లేసియర్​ మీద స్టాంప్​ను విడుదల చేశారు.

జమ్ముకశ్మీర్​ స్వయంప్రతిపత్తి రద్దును సమర్థించారు రావత్. ఆర్టికల్​ 370 రద్దుతో క్రమక్రమంగా దేశంలోని మిగతా ప్రాంతాలతో జమ్ముకశ్మీర్​ కలిసిపోతుందన్నారు.

"పీఓకే, గిల్గిత్​ బాల్టిస్థాన్​ కలిపితేనే జమ్ము కశ్మీర్​. ఈ ప్రాంతాన్ని మన పశ్చిమ పొరుగుదేశం అక్రమంగా ఆక్రమించింది. ఆర్టికల్​ 370ని తాత్కాలిక ప్రాతిపదికన తీసుకొచ్చినప్పుడు.. పాక్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇప్పటివరకు రెండు సార్లు ఈ ఆర్టికల్​కు సవరణలు చేశారు. కానీ ఇప్పుడెందుకు హఠాత్తుగా 370పై మాట్లాడుతోంది పాక్. ఎందుకంటే.. అక్రమంగా ఆక్రమించిన ఈ ప్రాంతాన్ని పాక్​ ప్రభుత్వం పాలించట్లేదు. ఈ ప్రాంతమంతా ఉగ్రవాదుల నియంత్రణలో ఉంది. పీఓకే ఓ ఉగ్రవాదులు పాలిస్తున్న ప్రాంతం."

-బిపిన్​ రావత్​, భారత సైన్యాధిపతి

ఇదే వేదికగా ఆయుధాల కొనుగోలుకు సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించారు బిపిన్​ రావత్. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన సిగ్​ సేవర్​ రైఫిళ్లు అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా సిగ్​ సేవర్​ రైఫిళ్లు సైనికుల అమ్ముల పొదిలో చేరుతాయని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి:- కోటీశ్వరులతో నిండిన హరియాణా శాసనసభ!

Last Updated : Oct 25, 2019, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details