తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దు వెంబడి 3వేలసార్లు పాక్ కాల్పులు..! - సరిహద్దు వెంట గతేడాది 3వేలసార్లు పాక్ కాల్పులు..!

నియంత్రణ రేఖ వద్ద భారత్​ లక్ష్యంగా 2019లో 3479 సార్లు పాకిస్థాన్​ కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడినట్లు రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్ ​రాజ్యసభ వేదికగా వెల్లడించారు. ఈ ఘటనల్లో 13 మంది సైనికులు, సరిహద్దు రక్షణ దళానికి చెందిన ఇద్దరు మరణించినట్లు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Pakistan involved in 3,479 ceasefire violations along J-K border in 2019:
సరిహద్దు వెంట గతేడాది 3వేలసార్లు పాక్ కాల్పులు..!

By

Published : Feb 11, 2020, 12:43 AM IST

Updated : Feb 29, 2020, 10:35 PM IST

భారత్​పై తన తీరును దాయాది పాకిస్థాన్ ఎంతమాత్రం మార్చుకోవడం లేదని ఆరోపించారు రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్. 2019లో జమ్ముకశ్మీర్​ సరిహద్దు వెంబడి మొత్తం 3479 సార్లు పాకిస్థాన్​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు రాజ్యసభ వేదికగా సమాధానమిచ్చారు. ఇరు దేశాల సరిహద్దు వద్ద జరిగిన కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన 13 మంది, సరిహద్దు రక్షణ దళానికి చెందిన ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు వెల్లడించారు.

"భారత్​లోకి అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించిన ఉగ్రవాదులను మన సైనికులు మట్టుబెట్టారు. భారత సైనికులు సామాన్య పౌరులపై కాల్పులు జరుపుతున్నట్టు చిత్రికరించేందుకు దాయాది దేశం ప్రయత్నిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్​, ఇతర ప్రాంతాల్లో శిక్షణ తీసుకుంటున్న ఉగ్రవాదులను అంతర్జాతీయ మీడియా గుర్తించకుండా ఉండేందుకే కాల్పులు జరుపుతోంది. పాక్ కాల్పులకు... భారత సైన్యం, సరిహద్దు భద్రత దళాలు దీటైన సమాధానం ఇస్తున్నారు."
-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి.

అధికారుల స్థాయిలో చర్చలు..

పాకిస్థాన్​ కాల్పులకు పాల్పడినప్పుడల్లా హాట్​లైన్​ల ద్వారా భారత అధికారులు పాక్ భద్రతాధికారులతో చర్చిస్తున్నట్లు.. ఇరుదేశాల సైనిక కార్యకలాపాల అధికారులు(డీజీఎంఓ) వారానికొకసారి భేటీ అవుతున్నట్లు వెల్లడించారు రాజ్​నాథ్​. సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) కూడా పాకిస్థాన్​ అధికారులతో కాల్పుల విరమణ ఉల్లంఘనలపై చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు.

అక్టోబర్​లో ఎక్కువ..

జమ్ముకశ్మీర్​ సరిహద్దు వద్ద జనవరిలో 216 సార్లు, ఫిబ్రవరిలో 251, మార్చిలో 275, అక్టోబర్​లో 398, నవంబర్​లో 333, డిసెంబర్​లో 393 సార్లు.. పాక్​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు రాజ్​నాథ్​ స్పష్టం చేశారు. 2019 ఏడాది మొత్తంలో ఒక్క జూన్​ నెలలో మాత్రమే అతి తక్కువగా 190సార్లు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.

సిమ్లా ఒప్పందం, లాహోర్​ తీర్మానం ప్రకారం నియంత్రణ రేఖ, కశ్మీర్​లోని అంతర్జాతీయ సరిహద్దు రేఖ ప్రాధాన్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పొరుగు దేశానికి ఉందని పాక్​ అధికారగణానికి భారత్​ పలుసార్లు గుర్తు చేస్తోందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:'సరిహద్దులు మూసేస్తేనే కరోనా త్వరిత వ్యాప్తి

Last Updated : Feb 29, 2020, 10:35 PM IST

ABOUT THE AUTHOR

...view details