ఉగ్రవాదులను ఉసిగొల్పి భారత్‌లో అస్థిరత్వం నెలకొల్పాలని చూస్తున్న పాకిస్థాన్‌తో చర్చలు ఏలా సాధ్యమవుతాయన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా లేవనెత్తాలని చూస్తున్న పాక్‌కు ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు. లేహ్‌లో డీఆర్డీవో కార్యక్రమానికి హాజరైన రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రజలు మనకు అండగా ఉన్నారు. మన పొరుగు దేశానికి ఏమైందో అర్థంకావడం లేదు. ముందు మీరు(పాక్) ఉగ్రవాదాన్ని ఆపండి. పొరుగుదేశంతో సత్సంబంధాలు కొనసాగించాలని మాకు ఉంది. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెబుతూనే.. తీవ్రవాదులను ఉసిగొల్పుతున్నారు. వారికి అండగా ఉంటున్నారు, సమర్థిస్తున్నారు. భారత్‌లో అస్థిరత్వం నెలకొల్పాలని చూస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే చర్చలు ఎలా సాధ్యం?"
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
కశ్మీర్ అంశంలో పాక్‌కు అంతర్జాతీయంగా ఏ దేశమూ మద్దతుగా నిలవడం లేదన్నారు రాజ్‌నాథ్.