తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌- పాక్ పనే - Pakistan based hackers target personal website of Kishan Reddy

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్​సైట్​ను పాకిస్థాన్​కు చెందిన వ్యక్తులు హ్యాక్ చేశారు. వెబ్​సైట్​లో పాకిస్థాన్ అనుకూల నినాదాలతో పాటు, భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సందేశాలు పెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వెబ్​సైట్ హ్యాక్​కు గురికాగా.. మంగళవారం ఈ విషయాన్ని కిషన్​ రెడ్డి కార్యాలయం ధ్రువీకరించింది.

Pakistan based hackers target personal website of MoS (Home) G Kishan Reddy, now temporarily unavailable
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌- పాక్ పనే

By

Published : Aug 25, 2020, 7:28 PM IST

పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు భారత్‌లోని ప్రముఖుల వ్యక్తిగత వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకొని రెచ్చిపోతున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కిషన్‌ రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌కు గురైంది. ఆయన వ్యక్తిగత వెబ్‌సైట్‌లో పాకిస్థాన్‌ అనుకూల నినాదాలతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హ్యాకర్లు సందేశాలు పెట్టారు.

ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని కిషన్‌ రెడ్డి కార్యాలయం మంగళవారం ధ్రువీకరించింది. హ్యాకింగ్‌ అనంతరం ఆయన వెబ్‌సైట్‌ (kishanreddy.com)ఓపెన్‌ చేస్తే 'తాత్కాలికంగా అందుబాటులో లేదు' అనే సందేశం వస్తోంది.

ప్రభుత్వ సమాచారం లేదు

కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సమాచారమూ లేదని అధికారులు తెలిపారు. వ్యక్తిగత వివరాలతో పాటు రోజువారీగా ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని స్పష్టంచేశారు. ఇవన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నవేనని చెప్పారు.

ఇదీ చదవండి-బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!

ABOUT THE AUTHOR

...view details